సింగరేణి సిఎండి ని కలిసిన రత్న కుమార్
ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు వినతి పత్రం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 28.కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నీ కలిసి వినతి పత్రం అందజేసిన దళిత జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అండ్ సొసైటీ అధ్యక్షులు రత్నకుమార్ .ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు దళిత జర్నలిస్ట్ ఫోరం సభ్యులకు సింగరేణి ఏరియాలో జర్నలిస్టులకు సమావేశం ఏర్పాటు చేసుకొనుటకు సౌకర్యాలు లేనందున సింగరేణి కొత్తగూడెంలో ఆఫీసు ఏర్పాటు చేసుకొనుటకు సింగరేణి క్వార్టర్ ను ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన సింగరేణి చైర్మన్ బలరామ్ ఐఆర్ఎస్ త్వరలోనే దీనికి పరిష్కారం చేస్తామని వారన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన దళిత జర్నలిస్టు ఫోరం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్.