బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ మండల అధ్యక్షునిగా కాట్రపల్లికి చెందిన పెరుమాండ్ల కోటేశ్వర్ గౌడ్ శుక్రవారం రోజున నియామకమయ్యారు. బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ వ్యవస్థపాక అధ్యక్షులు జక్కని సంజయ్, రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షుడు కుడికాల భాస్కర్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్ అధ్యక్షతన శుక్రవారం రోజు హుజురాబాద్ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మండల ఉపాధ్యక్షులుగా హుజూరాబాద్ కు చెందిన కందుకూరి భాస్కరా చారి, ప్రధాన కార్యదర్శిగా వేముల రమేష్, కార్యదర్శిగా కట్ల రవీందర్, ప్రచార కార్యదర్శిగా దాసరి రాజు, సోషల్ మీడియా కన్వీనర్ గా కోల సాయికుమార్, సోషల్ మీడియా కో కన్వీనర్ గా చిదురాల శ్రావణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పత్తిపాక భావన ఋషి, నియామకమయ్యారు. ఈ సందర్బంగా వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ మాట్లాడుతూ బీసీ హక్కుల సాధన మహనీయుల స్ఫూర్తితో, చిత్తశుద్ధితో కార్యవర్గం పనిచేయాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు బోయిన సంపత్ ముదిరాజ్, రావుల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.