విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు. అక్షర గెలుపు, హుజూరాబాద్ డిసెంబర్ 31:
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో మంగళవారం రోజున ముందస్తు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారని పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లలు, వారి క్లాస్ టీచర్లు కేకులు కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికొకరు చెప్పుకున్నారు. తదనంతరం పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపాలని, వారు మంచి విజ్ఞానం పొందాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, అలాగే పాఠశాల పై నమ్మకం ఉంచి తమ పిల్లలను పాఠశాలకు పంపుతున్న తల్లిదండ్రులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. తదనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు డాన్సులతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండ బత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.