విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు

విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు

1890507f-f39e-42b4-963f-9595dd8a449f

అక్షర గెలుపు, హుజూరాబాద్, డిసెంబర్ 21:

హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో శనివారం రోజున భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో పాఠశాల విద్యార్థులు తయారుచేసిన చార్ట్ లు, మోడల్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ భారతీయ గణిత శాస్త్రవేత్తలు గణితంలో అనేక పరిశోధనలు చేశారని, నిత్యజీవితంలో మనకు గణితం ఎంతో ఉపయోగపడుతుందని, గణితం అన్ని సబ్జెక్టులకు మూలాధారమని, చాలామంది పిల్లలు గణితం అంటే చాలా హార్డ్ సబ్జెక్ట్ అంటారు కానీ, గణితమును ఇష్టంతో ప్రాక్టీస్ చేస్తే లెక్కలు చాలా సులభమని, కష్టంతో కాకుండా ఇష్టపడి చేయాలని తెలిపారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ చాలామంది పిల్లలు పదవ తరగతి పూర్తి అయిన తర్వాత  ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అవుతున్నారని, గణితం ఎంచుకుంటే తమ భవిష్యత్తు బాగుంటుందని, జాబ్ సంపాదించి జీవితంలో స్థిరపడటానికి మనకు ఒక దగ్గరి మార్గం అని తెలిపారు. తదనంతరం విద్యార్థులకు గణితం పైన క్విజ్ ప్రోగ్రాం నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. తదనంతరం పాఠశాల గణిత ఉపాధ్యాయులైన రమేష్, శ్రీనివాస్, ఉమాదేవి లను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక