బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!

బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!

 

బంగారం అంటే భారతీయ మహిళలకు ఎంతో ఇష్టం. ప్రతి పండుగకు, ఇంట్లో శుభకార్యానికి బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఒకవేళ కొనుగోలు చేయలేకపోతే ఉన్న ఆభరణాలే ధరించడానికి మొగ్గు చూపుతుంటారు. ద్రవ్యోల్బణం ప్రభావం నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా బంగారం నిలుస్తుంది. గతంతో పోలిస్తే 2024లో బంగారంపై పెట్టుబడులకు 20 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు తదితర పొదుపు పథకాలపై ఆరు నుంచి 7-8 శాతం రిటర్న్స్ మాత్రమే లభిస్తాయి.

ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.63, 870 పలికింది. శనివారం తులం బంగారం ధర రూ.77,450 పలుకుతుంది. గత జూలైలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ బంగారంపై దిగుమతి సుంకం భారీగా తగ్గించడంతో కొద్దికాలం తగ్గుముఖం పట్టినా.. మళ్లీ బంగారం ధర తిరిగి పెరగడం మొదలైంది. గత అక్టోబర్ 31న తులం బంగారం ధర రూ.81,330 లతో జీవిత కాల గరిష్టాన్ని తాకింది.నవంబర్ 17 నాటికి తులం బంగారం ధర రూ.75,650లకు దిగి వచ్చింది. నవంబర్ 24న రూ.79,640లకు చేరుకుని డిసెంబర్ 11 నాటికి 79,470 చేరుకున్నది. అంటే జనవరి ఒకటో తేదీతో పోలిస్తే బంగారం ధర పది నెలల్లో రూ.17,460 వృద్ధి చెందింది. అక్టోబర్ 31తో పోలిస్తే శుక్రవారం నాటికి రూ.3880 ధర తగ్గినా, జనవరి ఒకటో తేదీ ధరతో రూ.13,580 వృద్ధి చెందింది.

జనవరి ఒకటో తేదీన రూ. రూ.63, 870 పలికిన తులం బంగారం ధర ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి రూ.69,380 చేరుకుంది. మే 20న 75,160 పలికిన తులం బంగారం ధర జూలై 19 నాటికి రూ.74,350లకు చేరింది. అటుపై బంగారంపై సుంకం తగ్గించడంతో జూలై 26 వరకు రూ.68,730లకు దిగి వచ్చింది. నాటి నుంచి క్రమంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. నవంబర్ ఒకటో తేదీన రూ.81,330లతో జీవిత కాల గరిష్టాన్ని తాకిన బంగారం ధర.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో క్రమంగా దిగి వచ్చింది.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక