కార్మికుల హక్కులను కాపాడుకోవడం కోసం ఐక్యత అవసరం

IMG-20250116-WA0018ఈనెల 18న కొత్తగూడెంలో జరిగే ఐ ఎఫ్ టి యు రాష్ట్ర విలీన సదస్సు ను జయప్రదం చేయాలని ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 16.

కొత్తగూడెం నూతన చట్టాల పేరుతో కార్మికుల హక్కులు కాలరాస్తూ,కార్మికులను బానిసలుగా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పి కొట్టాలని,

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు యూనియన్లు ఈనెల 18 వ తారీఖున కొత్తగూడెం లో రాష్ట్రస్థాయిలో విలీనం కాబోతున్నాయని ఈ సందర్భంగా కొత్తగూడెంలో జరిగే భారీ ప్రదర్శన, రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలని కొత్తగూడెం హెడ్ ఆఫీస్,మరియు వివిధ డిపేర్ట్మెంట్ లలో ప్రచారం చేయడం జరిగింది. అనంతరం ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే సీతారామయ్య మాట్లాడుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందని వారు అన్నారు.కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,వారికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వారు అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఒకపక్క కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ నూతన చట్టాల పేరుతో కార్మిక చట్టాలను తీసుకువచ్చిందని వారు అన్నారు.ఈ నూతన చట్టాలతో కార్మికులు బానిస వర్గంగా మారిపోతున్నారని బ్రిటిష్ కాలం నాటి బానిస వ్యవస్థ అమలు చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చిందని వారు అన్నారు. కార్మికుల హక్కుల కోసం వారి ప్రయోజనాల కోసం భారత కార్మిక సంఘాల సమాఖ్య నిరంతరం పోరాడుతుందని ఈ క్రమంలోనే రెండుగా ఉన్న ఐ ఎఫ్ టి యు లు విలీనం అవుతున్నాయని వారు అన్నారు.కావున ఈ సదస్సుకి ముఖ్య వక్తలుగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ,సాధినేని వెంకటేశ్వర్లు, టి.శ్రీనివాస్,పి.ప్రసాద్ (పిపి), బూర్గుల ప్రదీప్,ఈ ర్యాలీ సదస్సు కి కార్మికులు,కర్షకులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(యస్ సిసి డబ్ల్యూ యు -ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర నాయకులు ఎన్.సంజీవ్,రీజియన్ కార్యదర్శి గౌని నాగేశ్వర్ రావు, మోత్కూరి మల్లికార్జున్ రావు,మణెమ్మ,రాధ, నాగలక్ష్మి,కరణ,కృష్ణ, లతో పాటు వివిధ డిపార్ట్మెంట్ లలో కార్మికులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి