కోతులు కుక్కలను తక్షణం పట్టించండి

IMG-20250116-WA0033IMG-20250116-WA0035IMG-20250116-WA0034అన్ని వార్డుల్లో ప్రతి వీధికి ఇంటి నెంబర్లతో కూడిన వీధి బోర్డులను వెంటనే పెట్టించండి

మున్సిపల్ కమిషనర్ కి విన్నవించిన మునిసిపల్ కౌన్సిలర్ మాజీ ఫ్లోర్ లీడర్, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాస్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 16.

కొత్తగూడెం ఇందిరమ్మ ఇండ్ల ఎంక్వయిరీ లో భాగంగా సూపర్ చెక్ నిమిత్తం 23 వ, వార్డు లో పర్యటించిన కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గౌరవ శేషాంజన స్వామి గారిని 23వ వార్డ్ కౌన్సిలర్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వారితోపాటు వార్డులో పర్యటించి 23వవార్డు తోపాటు కొత్తగూడెం మున్సిపల్ ప్రజలు ఎదురుకుంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు కొత్తగూడెం పట్టణంలో అన్ని వార్డులు బస్తీలలో కోతులు బెడద తీవ్రంగా ఉందని కుక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని వృద్ధులను పిల్లలను గాయపరుస్తూ దాడులు చేస్తున్నాయని తక్షణమే బోన్లు తెప్పించి కుక్కలను కోతులను పట్టించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు అదేవిధంగా గతంలోనిధులు మంజూరై పెండింగులో ఉన్న ఇంటి నెంబర్లతో కూడిన వీధి బోర్డులను అన్ని వార్డులో అన్ని బస్తీలో తక్షణం పెట్టించాలని చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లను, ఇళ్ల స్థలాలను, రేషన్ కార్డులను, పింఛన్లను అర్హులైన పేదలందరికీ అందేలా తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు వార్డు ఎంక్వయిరీ ఆఫీసర్ జి .కృష్ణ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు వార్డు పెద్దలు కత్తెర రవీందర్, బండి సుభద్ర, రేణుక, విజయ, లక్ష్మి, లక్ష్మీనారాయణ, గౌస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి