యంగ్ ఇండియా కే బోల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, IYC జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 18.
దేశవ్యాప్తంగా యువతి యువతను మేలుకొల్పి, పేదల పక్షాన ప్రశ్నించే గొంతుకలనూ తయారు చేయడమే యంగ్ ఇండియా కే బోల్" కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ తో కలసి యంగ్ ఇండియా కే బోల్ సీజన్ - 5 కి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా ఉన్న యువతను పేద ప్రజల పక్షాన పోరాటంలో చేయడంలో భాగంగా యంగ్ ఇండియా కే సీజన్ - 5ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సమస్యల పరిష్కారంలో యువత ముందు వరుసలో ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, యంగ్ ఇండియా కే బోల్ ఎన్ రోల్మెంట్ కార్యక్రమం ఈ నెల 30 వరకు పొడిగించారని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే యువతి యువకులు గూగుల్ లో లింక్ అందుబాటులో ఉందని, అందులో వివరాలను పొందుపరిచే భాగస్వాములు కావచ్చన్నారు. గెలుపొందిన వారికి నగదు బహుమతుల ప్రధానం ఉంటుందని తెలిపారు. ఇందులో గెలిచిన వారికీ ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం అసెంబ్లీ ప్రెసిడెంట్ తరుణ్ రెడ్డి, చైతన్య, రవి, గుండాల మండల ప్రెసిడెంట్ అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి మతిన్, పవన్, సుజాతనగర్ మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్, చుంచుపల్లి మండల ప్రెసిడెంట్ శివ, ఇల్లందు ఏఎంసి చైర్మన్, గుండాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు.
About The Author


Related Posts


Latest News
