పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో వైభవంగా మకరజ్యోతి దర్శనం
పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల
మకర సంక్రాంతి సందర్భంగా పలు దేవాలయాల్లో పూజల్లో పాల్గొన్న కొత్వాల దంపతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 15.
మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామి దీక్ష పరులు పవిత్రంగా చేసుకునే మకరజ్యోతి దర్శనాన్ని కనుల పండుగల నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే పేరొందిన అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన పూజారి మాధవన్ నంబూద్రి, సహాయ పూజారి బృందావనం నరసింహ మూర్తి ల ఆధ్వర్యంలో తెల్లవారు జాము నుండే పూజలు నిర్వహించారు. శబరిమలై జ్యోతి దర్శనం మాదిరి పాల్వంచ అయ్యప్ప స్వామి దేవాలయంలో జ్యోతి దర్శనం నిర్వహించారు.
మకర జ్యోతి దర్శనంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని పూజలు చేశారు. దేవస్థానం ట్రస్ట్ సభ్యులు మేడిద సంతోష్ గౌడ్, కనగాల రాంబాబు, బందెల శ్రీనివాస్, కాల్వ భాస్కరరావు, మిర్యాల కమలాకర్, భక్తులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
సంక్రాంతి సందర్భంగా దేవాలయాల్లో పూజలు చేసిన కొత్వాల దంపతులు
మకర సంక్రాంతి సందర్భంగా మంగళవారం కొత్వాల తో పాటు సతీమణి *కొత్వాల విమలాదేవి దంపతులు, కుటుంబ సభ్యులు పాత పాల్వంచ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, మైసమ్మ తల్లి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.
About The Author


Related Posts

