కులమతాలకతీతంగా జరిపే పండుగ సంక్రాంతి
రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల
కొత్వాల ఇంటి వద్ద సంక్రాంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 16.
పాత పాల్వంచలోని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఇంటి వద్ద పాల్వంచ ప్రజలు సంక్రాంతి సంబురాలు జరిపారు.
భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా బుధవారం అర్థరాత్రి కొత్వాల ఇంటి వద్ద కనుమ వేడుకలు నిర్వహించారు. స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చారు.
ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు యండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో కొత్వాల ను శాలువా, పులా దండలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపి, మత సామరస్యాన్ని చాటారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ మైనారిటీ నాయకులు మతాలకతీతంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి, వేడుకల్లో పాల్గొనడం మత సామరస్యాన్ని చాటుతుందన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలందరినీ భోగభాగ్యాలతో, కొత్త వెలుగులు నింపాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమాల్లో ముస్లిం మైనారిటీ నాయకులు యండి అఖిమ్ ఖురేషి, యండి నాయక్ ఖురేషి, MD అబ్దుల్ నబీ,యండి సాజిత్, కుక్కలా రవి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.
About The Author


Related Posts

