అర్హులందరికీ రేషన్ కార్డులు...

IMG-20250116-WA0030అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 16:

అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ బలిజ పద్మా రాజారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు ,రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావుల ఆదేశాల మేరకు గురువారం వార్డులో అర్హత గల లిస్టు ప్రకారం నూతనంగా రేషన్ కార్డుల మంజూరి కొరకై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాల కోసం వినతులను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వచ్చిన వినుతుల్లో రేషన్ కార్డులు అవసరం ఉన్నవారి కోసం ఇంటింటా సర్వే నిర్వహించి, అర్హులను గుర్తించి నూతన రేషన్ కార్డులను అందించడం జరుగుతుందన్నారు. వినతులు సమర్పించని వారికోసం ప్రభుత్వం మరోసారి అవకాశాన్ని కల్పించేందుకు సమయం ఇస్తుందని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు సహకారంతో అర్హులందరికీ సంక్షేమ అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు అధికారి జగదీశ్వర్ ఉన్నారు.

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి