డయాలసిస్ యూనిట్లను ప్రజలకు అందుబాటులోకి తేవాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

IMG-20250115-WA0055భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 15.

 కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి అదనంగా కేటాయించబడిన డయాలసిస్ యూనిట్లను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ జితేశ్విని పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రతి వార్డును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఔట్ పేషెంట్ వార్డులో ఎక్స్రే యంత్రం పనిచేయకపోవటానికి గమనించి దీనిని ఎందుకు వాడటం లేదు అని సిబ్బందిని ప్రశ్నించారు, అది పాడైందని సిబ్బంది చెప్పగా కొత్త ఎక్స్రే యంత్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో ఎంతమంది డ్యూటీ డాక్టర్లు మరియు సిబ్బంది అందుబాటులో ఉన్నారు అని తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో చేపడుతున్న డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పనులు వారం రోజులలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ పనులను త్వరితగతిని పూర్తి చేసి డయాలసిస్ యూనిట్లు ప్రజల అవసరానికి ఉపయోగపడేలా త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా క్యాజువాలిటీ వార్డును మరొక చోటికి షిఫ్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు. సివేస్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.

ఈ పరిశీలనలో ఆసుపత్రి సిబ్బంది ఆర్ అండ్ బి అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి