ఫిబ్రవరి 5, 6 తేదీల్లో పాల్వంచ పట్టణంలో జరిగే ఎస్ఎఫ్ఐ 4వ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.
సి హెచ్ రామ్ చరణ్ , ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 18.
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4వ మహాసభలు పాల్వంచ పట్టణ కేంద్రంలో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో జరుగుతున్న నేపథ్యంలో స్థానిక జూలూరుపాడు మండలంలోని ప్రభుత్వ హైస్కూల్లో 4వ జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటాలు ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్నదనీ, పెండింగ్ స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కోసం, మెస్ కాస్మోటిక్స్ చార్జీల పెంపు కోసం, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ గా అప్ గ్రేడ్ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజులు నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహించామన్నారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ మరియు ప్రభుత్వ హైస్కూల్లో ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసామన్నారు. ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగానే మెస్, కాస్మోటిక్స్ చార్జీలు పెరిగాయన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోందనీ, విద్యార్థులను బోర్డు,ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పదవ తరగతి టాలెంట్ టెస్ట్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ పరీక్షలు అత్యున్నత ప్రమాణాలతో మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, విద్యార్థులలో దేశభక్తి భావాలు పెంపొందించడానికి జాతీయ నాయకుల జయంతులు, వర్థంతులు, సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు పలు అంశాలపై సెమినార్లు, చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అనేక మంది విద్యార్థి అమరవీరులు ప్రాణ త్యాగం చేసిన త్యాగాల గడ్డపై 4వ మహాసభలు నిర్వహించడం చారిత్రాత్మకం అన్నారు. జిల్లా మహాసభలకు జిల్లాలోని 23 మండలాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు, భవిష్యత్తులో జిల్లా విద్యారంగ అభివృద్ధికి అనేక అంశాలపై సమగ్రంగా చర్చించి పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. మహాసభల జయప్రదంకై విద్యారంగ శ్రేయోభిలాషులు, మేధావులు, ఉపాధ్యాయులు, అభ్యుదయవాదులు, విద్యార్థులు తమ విలువైన సూచనలు, సలహాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు పి.పవన్, హైస్కూల్ నాయకులు సాయి, కిరణ్, చరణ్, హర్ష, నందిని, అఖిల తదితరులు పాల్గొన్నారు.
విప్లవాభివందనలతో
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)
సి హెచ్ రామ్ చరణ్
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు
9573375531.
About The Author


Related Posts

