రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న నాలుగు సంక్షేమ పథకాల సర్వేను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న నాలుగు సంక్షేమ పథకాల సర్వేను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 18.
కొత్తగూడెం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపడుతున్న సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశానుసారం సంక్షేమ పథకాల అమలులో భాగంగా చేపడుతున్న సర్వే పురోగతిపై జిల్లాలోని తాసిల్దార్లు ఎంపీడీవోలతో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు గాను వ్యవసాయ యోగ్యమైన భూములకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6000 చొప్పున రెండు విడతలుగా రూ. 12,000 భూ భారతి  పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా చెల్లిస్తుందని, అలాగే ఇళ్లు (లేదా) కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, రాళ్ళు, రప్పలు, గుట్టలతో నిండి, సాగుకు అనువుగా లేని భూములను గుర్తించి, తొలగించాలని సూచించారు. రైతు భరోసా పథకం అమల్లోకి భాగంగా జిల్లా లోని 354 రెవెన్యూ గ్రామాలలో భూ సర్వే నిర్వహించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలన్నారు. 354 రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటివరకు 194 రెవెన్యూ గ్రామాల సర్వే పూర్తి అయిందని మిగిలిన 160 రెవెన్యూ గ్రామాల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
కొత్త రేషన్ కార్డు మంజూరు లో భాగంగా ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా జిల్లాలో 29141 దరఖాస్తులు వచ్చాయని అదేవిధంగా రేషన్ కార్డులో కొత్త సభ్యులను జతపరచడానికి గాను 10796 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ దరఖాస్తులన్నింటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత పట్టిక ద్వారా ప్రతిరోజు సాయంత్రం నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన మరియు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని జాబితాలో పేరు రాని అర్హుల వివరాలను కూడా నిర్దేశిత పట్టికలో నమోదు చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. లబ్ధిదారుల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని, ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి