తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?

తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?

 

అక్షరగెలుపు న్యూస్ ప్రతినిధి : వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యం లో మొట్టమొదటి సారిగా ఒడిశా రాష్ట్ర విద్యాశాఖ అన్ని పాఠశాలలో ఇకపై వాటర్ బెల్ కూడా ఉండా లని ఒడిశా విద్యాశాఖ నిర్ణయించింది, విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల సమయములో మూడుసార్లు వాటర్ బెల్ మోగాలని ఉత్తర్వులు జారీ చేసింది....ఈ నేపథ్యంలోనే  తాజాగా తెలంగాణలో కూడా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఆ స్కూల్ హెడ్ మాస్టర్‌ సహా స్టాఫ్ అంతా కలిసి పిల్లలకు వాటర్ బెల్ ఉండాలని,ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల బడిలో నీటి గంటలు వినిపించే సాంప్రదాయానికి ఆ స్కూల్ శ్రీకారం చుట్టింది. అనారోగ్య సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు తమవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారుఉపాధ్యాయులు. సాధా రణంగా ఉపాధ్యాయులు వచ్చామా.. పాఠాలు చెప్పామా.. వెళ్లామా అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం అలా కాదు. విద్యాతో పాటు వారి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటర్ తాగ కపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. అందుకే అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందు కు వాటర్ తాగిస్తున్నారు. పిల్లలు ఇంట్లో కంటే ఎక్కువ సమయం స్కూల్లో గడుపుతుంటారు. అందుకే వారితో ఎక్కువ వాటర్ తాగించాలనే ఉద్దేశంతో స్కూల్లో వాటర్ బెల్ పెట్టారు.ప్రతీ విద్యార్థి ఇంటి నుంచి స్కూలుకి వచ్చి తిరిగి ఇంటికి చేరే వరకు కనీసం 1 లీటర్ నీరు తాగాలని రూల్ పెట్టారు. అందుకు అవసరమైన చొరవ తీసుకుంటూ కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రోజుకు రెండు సార్లు వాటర్ బెల్స్ మోగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సమయంలో తరగతి గదుల్లో ఉన్న విద్యార్థు లంతా కూడా పాఠశాల ఆవరణలోకి వచ్చి నీటిని తాగాల్సి ఉంటుంది. వీరితో పాటు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా నీరు తాగుతున్నారు

Views: 4

About The Author

CHIFF EDITOR  Picture

D.VENKATESH  PHONE NUMBER : 9490817191

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి