కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే రైతుల అభివృద్ధికి పెద్ద పేట 

IMG-20250111-WA0022

పగిడేరు ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన  

రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 11.కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్ర రైతాంగ అభివృద్ధికి పెద్ద పేట వేస్తున్నదని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ డి సి ఎం ఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పినపాక నియోజకవర్గం పరిధిలోని పగిడేరు లో డీసీఎంఎస్ ద్వారా నిర్వహించబడుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కొత్వాలసందర్శించారు. తూకం వేయు విధానం, తూర్పార పట్టడం, లారీ ల ద్వారా ధాన్యం రవాణా విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ చేపట్టి తిరిగి వారికి రుణాలు ఇస్తున్నదన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తూ సన్నబియ్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన వారికి క్వింటాలుకు 500 రూ// బోనస్ గా ఇస్తున్నదన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తూ దళారీల నుండి రైతులను కాపాడుతున్నదన్నారు. త్వరలోనే రైతు భరోసా 12 వేల రూపాయలు ఎకరానికి ఇవ్వనున్నదన్నారు. 

ఈ కార్యక్రమంలో పగిడేరు మాజీ సర్పంచ్ తాటి భిక్షం, పాల్వంచ కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న, దారా చిరంజీవి, పులి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.*

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి