క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుజువ్వాడి కృష్ణారావు..
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 15:
కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని నిర్వహించినఐలపూర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఈరోజు బహుమతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వాహకులను అభినందిస్తున్నానని యువకులు క్రీడల్లో రాణించాలని కోరారు ఈ పోటీల్లో 11 జట్లు పాల్గొన్నాయి విన్నర్ గా ఆర్ఆర్ వై జట్టు నిలవగా రన్నర్ గా జె బి వై జట్టు నిలిచాయి ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాళ్ళ సత్యనారాయణ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలేటి మహిపాల్ రెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కరిపిల్లి అజయ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు నాగునురి గంగాధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క సుధీర్ తదితరులు పాల్గొనగా స్పాన్సర్ గా కరిపెల్లి అజయ్ రెడ్డి వ్యవహరించారు
About The Author


Related Posts

