ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను విజయవతం చేయండి..
టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మానుక ప్రవీణ్ కుమార్..
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 16:
కోరుట్ల నియోజకవర్గంలో రేపు శనివారం రోజున నిర్వహిస్తున్న నందమూరి తారక రామారావు 29,వ వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి మానుక ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో ఎన్టీఆర్ 29,వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఈ వేడుకల్లో కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల టిడిపి నాయకులు, క్రియాశీల కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు యువత నాయకులు ,తెలుగు మహిళల నాయకురాలు, అందరూ కలిసి కట్టుగా పాల్గొని వర్ధంతి వేడుకలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండల కేంద్రాల్లో, వేముల కుర్తి గ్రామంలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు, ప్రభుత్వ ఆసుపత్రులలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం కోరుట్ల నియోజకవర్గ టిడిపి ఆఫీస్ లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ మండల నాయకులు ఎక్కడ వీలుంటే అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు.
About The Author


Related Posts

