మహిళా బిల్లులో బీసీ కోటపై స్పష్టతనివ్వాలి.

IMG-20250111-WA0030అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 11:

హుజూరాబాద్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన మండల సరితను బిసి అజాది మహిళ సమైక్య మండల అధ్యక్షురాలుగా నియమిస్తూ బీసీ ఆజాతి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ లు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రోజున హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో జరిగిన బీసీ మహిళ సమావేశంలో వారిని ఏకగ్రీవంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళా బిల్లులో బీసీ కోటపై స్పష్టతనివ్వాలని, బీసీమహిళల ఐక్యతతో రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాలని, గ్రామ గ్రామాన బీసీల ఐక్యతతో పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. సావిత్రిబాయి పూలే, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కల స్ఫూర్తితో జాతీయ మహిళా బిల్లులో బీసీల వాటా కోసం పోరాటాన్ని చేస్తామని అన్నారు. అనంతరం నియమించబడిననాయకురాలు మండల సరిత మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ నియామకం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. బీసీల ఉద్యమ బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. తన నియమకానికి కృషిచేసిన జిల్లా కన్వీనర్ చిలక మారి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, నాయకురాలు బింగి రాణి, బీసీ ఆజాది మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు చిందం సునీత, జిల్లా అధ్యక్షురాలు తేజశ్రీ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 2

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి