మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి

మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి

జెఎంఈటిల ప్రమోషన్లలో జరిగే అన్యాయాన్ని సరిచేయాలి

గత గుర్తింపు సంఘం అవగాహన లోపంతోనే ప్రమోషన్లలో అన్యాయం 

సింగరేణి గుర్తింపు సంఘం నేతలు సీతారామయ్య, రాజ్ కుమార్

సింగరేణి ఉన్నతాధికారులతో చర్చించిన గుర్తింపు సంఘం నేతలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 21.
కొత్తగూడెం (సింగరేణి) ఏరియాలో పనిచేస్తున్న మైనింగ్ సూపర్వైజర్ సిబ్బందిని బదిలీలను నిలుపుదల చేసి త్వరలో ప్రారంభం కానున్న వికె-7 ఓపెన్ క్యాస్టులో సర్దుబాటు చేయాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్రకమిటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణి జనరల్ మేనేజర్ (ఐఆర్)ను యూనియన్ ప్రతినిధు బృందం వినతిపత్రం అందించి సమస్యలను అధికారికి వివరించారు. చర్చల అనంతరం నాయకులు మాట్లాడుతూ 2016లో అప్పటి గుర్తింపు సంఘం చేసిన తప్పుడు ఒప్పందంతో జెఎంఈటిల ప్రమోషన్లలో అన్యాయం జరుగుతోందని, వీరు చేసిన ప్రమోషన్స్ ఒప్పందం కొందరికె ఉపయోగపడిందని, ప్రతి ఒక్కరికి బి గ్రేడ్ అవర్మేన్లుగా ప్రమోషన్స్ ఇవ్వాలని కోరామన్నారు. గతంలో బదిలీపై వచ్చిన వారిని మరల కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేయడం వలన వారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సమస్యకు పరిస్కారం చూపాలన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన మైనింగ్ సిబ్బందికి సెటిలింగ్ అలవెన్సు మంజూరు చేయాలనీ కోరామని తెలిపారు. వినతిపత్రం అందించినవారిలో వంగ వెంకట్, వట్టికొండ మల్లికార్జునరావు, రమణమూర్తి, రాంగోపాల్, కిష్టాఫర్, సాయి పవన్, దార శివ తదితరులు ఉన్నారు.

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి