స్థానిక కొత్తగూడెం మేదర బస్తీ లోని శ్రీ రాగా స్కూల్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు

IMG-20250111-WA0023ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనగర్ ఉప సర్పంచ్ లగడపాటి రమేష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 11.

కొత్తగూడెం ఈ సందర్భంగా స్కూల్ ఆవరణం అంతా పూల దండలు ,పచ్చని తోరణాలు ,బెలూన్లతో పతంగులతో అలంకరించారు.

ప్లే స్కూల్ పిల్లల ఫ్యాన్సీ డ్రెస్సులు అలరించాయి.

పిల్లలకు ముగ్గులు, మెహందీ , కైట్స్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా లక్ష్మీ దేవిపల్లి ఉప సర్పంచ్ శ్రీ లగడ పాటి.రమేష్ 20 వ వార్డు కౌన్సిలర్ శ్రీ పూర్ణ స్టేట్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ మొగిలి రైల్వే డిపార్టుమెంట్ నుండి శ్రీ మురళీ సుదర్శన్ విచ్చేసారు..ముందుగా అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ కృష్ణుడికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు.అనంతరం భోగి మంటలు వేశారు.పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు.అతిథులు మాట్లాడుతూ శ్రీ రాగా స్కూల్ మేనేజ్మెంట్ , స్టాఫ్ కలిసి పిల్లలకు విద్య తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఇటు చదువుల్లో మరియు పోటీ పరీక్షల్లో , సైన్స్ ఫెయిర్ లో కూడా తీర్చి దిద్దు తూ రాష్ట్రం లోనే ముందంజలో వుందన్నారు..

బహుమతులు సాధించిన వారిలో ఫస్ట్ ప్రైజ్ లు:- చాణక్య , సిమా రుహిన్,లిక్షిత్ , కైరున్నిస్స, 

సెకండ్ ప్రైజ్ లు:- శివ శంకర్,శిరిన్,హర్షిణి, జాహ్నవి ,

థర్డ్ ప్రైజ్ లు:- నీరజ్ , నైన ప్రియ , సోనియా, కీర్తి , స్వాతి లు గెలుచుకున్నారు.

ఈ బహుమతులు అతిథులతో కరస్పాండెంట్ మల్లారపు.వరప్రసాద్ మరియు కవితలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు సంధ్య ,కౌశర్ , సర్వేశ్వర రావు ,రాంసింగ్ ,గాయత్రి , నాగమణి ,జ్యోతి , అనుష ,ధన లక్ష్మి , శోభ , నౌషిన్,రేష్మ తదితరులు పాల్గొన్నారు..

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి