కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం

అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 18:

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక -శ్రీనివాస్, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీ ఫోటోకి శనివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నిస్తే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తే  భయపడబోమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ప్రజా పక్షాన పోరాడుతూనే ఉంటామని వారు అన్నారు. ఆరు గ్యారెంటీలు ఆటకెక్కినై, రైతు రుణమాఫీ 50% కూడా పూర్తి కాలేదని అన్నారు. రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుల కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాధ ముత్యంరాజు, ముక్క  రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, మక్కపల్లి కుమార్, కేసిరెడ్డి లావణ్య, మారపెల్లి సుశీల, సీనియర్ నాయకులు వర్తినేని రవీందర్ రావు, ములుగు పూర్ణచందర్, కొండ్ర నరేష్, ఇమ్రాన్, తదితరులు  పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి