ఎస్సీ వర్గీకరణ న్యాయమైన, ధర్మమైన సామాజిక ఉద్యమం.
రామవరం, మాదిగ సంక్షేమ సంఘం లో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 15.
కొత్తగూడెం కేంద్రంలోని రామవరం పట్టణంలో మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంపూర్ణ మద్దతు ప్రకటించిన పలు సంఘాలు. ప్రముఖ విద్యావేత్త, అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత సిద్దెల రవి అధ్యక్షతన రామవరం మాదిగ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన "రౌండ్ టేబుల్ సమావేశం" లో పాల్గొన్న ప్రజాస్వామ్యిక, అభ్యుదయ, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ కోరుతూ దండోరా పేరుతో ముప్పై ఏండ్లుగా, చేస్తున్న ఉద్యమం, న్యాయమైన, ధర్మమైన, రాజ్యాంగ బద్ద,శాంతియుత పోరాటం అని, ఇది పలు కుల సంఘాల ఏర్పాటు తో పాటు ఆయా ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిందని, అంతే కాకుండా గుండెజబ్బుల పిల్లల కోసం, వికలాంగుల హక్కుల కోసం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్ లో రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పునరుద్ధరణ కోసం, సమాజంలో ఉన్న పలు బహుజనుల హితం కోసం ఎన్నో పోరాటాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలతో పాటు అందరి హృదయాలను కదిలించిందని, అందుకే అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చామని, విషయంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ ఉద్యమానికి ముగింపు పలకాలని అభిప్రాయ పడుతూ, ఫిబ్రవరి 7 న హైదరాబాద్ లో తలపెట్టిన వేల గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక కార్యక్రమానికి మద్దతునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంఘాల జాతీయ నాయకులు తూముల శ్రీనివాస్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు, యువ న్యాయవాది బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సంకుబాపన అనుదీప్ , మైనారిటీ నాయకులు షబ్బీర్, కురుమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దూడల బుచ్చయ్య, గిరిజన సంఘం నాయకులు బాణోత్ బిక్కులాల్, మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకటేశ్వర్లు, తొలి తరం దండోరా ఉద్యమ రధసారధి చాట్ల హనుమంతరావు, మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి మోదుగు జోగారావు, మాదిగ ఐక్య వేదిక అధ్యక్షులు వేల్పుల భాస్కర్, తెలంగాణ ఉద్యమకారులు, మాదిగ కళా మండలి రాష్ట్ర కార్యదర్శి సిద్దెల హుస్సేన్, గాయకులు చర్ల నాగేశ్వరరావు, తెలంగాణ ఉద్యమ నేత గూడెల్లి యాకయ్య, మాల సంఘం నాయకులు బాలకృష్ణ, అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేష్, సలిగంటి బాబు, రామవరం పరిరక్షణ సభ్యులు ముస్తఫా, మైనార్టీ సంఘం నాయకులు షబ్బీర్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు డప్పు కుమార్, మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, సావటి స్వామి, కొత్తూరు మదనయ్య, కూరగాయల శ్రీనివాస్, చెనిగారపు కుమారస్వామి, మల్లారపు కొమరయ్య,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొప్పుల రమేష్, బొంకూరి పోశం, శనిగారపు కుమార్, చాట్ల రామారావు, పెరిక కిరణ్, ఇల్లందుల పోచయ్య, సమ్మన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజశేఖర్, హరిబాబు, మిరియాల వెంకటేశ్వర్లు, మద్దికుంట గణేష్,డప్పు కళాకారులు చర్ల కుమార్, శంకర్ ,దాసరపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author


Related Posts

