విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
విద్యార్థులకు కరస్పాండెంట్ వేణుగోపాల్ పిలుపు
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు
అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లో గల శాతవాహన స్కూల్ లో ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రైన్బో స్కూల్ కరస్పాండెంట్, ట్రస్మ జిల్లా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు సైన్స్ మానవ సమాజానికి చేస్తున్న మేలు తీరు ఆలోచించి ముందుకు పోవాలని పేర్కొన్నారు. కరస్పాండెంట్ వేణుగోపాల్ మాట్లాడుతూ సైన్స్ రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు సార్ సి వి రామన్ ఎ బి జె అబ్దుల్ కలాం సుభాష్ చంద్రబోస్ మేరీ విలీయం చేసిన సేవలను కొనియాడారు. వారి భాటలో విద్యార్థిని విద్యార్థులు నడిచి దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన ప్రయోగాలు ఆలోచింపజేసాయి. ఈ విజ్ఞాన ప్రదర్శనలో యూకేజి నుంచి ఆరవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ ప్రయోగాలను ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వేణుగోపాల్ మరియు శ్రీనివాస్ సార్, టీచర్లు సువర్చల, విద్య, శైలజ, లీల, అక్షర, వేదశ్రీ తదితరులు విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
About The Author


Related Posts

