వార్త తరంగాలు సంక్రాంతి ముగ్గుల పోటీలు

IMG-20250111-WA0026వార్త తరంగాలు 25వ వార్షికోత్సవ వేడుకలు 

ఎస్ ఆర్ కే టి స్కూల్ సౌజన్యంతో వేడుకలు 

ప్రజలలో ఉండేవాడే నిజమైన జర్నలిస్ట్

ముఖ్య అతిథులను సన్మానించిన వార్త తరంగాలు స్టాప్ రిపోర్టర్ రత్నకుమార్

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 11. చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్ కమ్యూనిటీ హాల్ నందు వార్తా తరంగాలు 25వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఎస్ ఆర్ కే టి స్కూల్ కె పి సి కన్స్ట్రక్షన్స్ కంపెనీ సౌజన్యంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు 2025 ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఎస్ ఆర్ కే టి స్కూల్ డైరెక్టర్లు హత్తి రామ్ కె.వి.రామరాజు రామానుజన్ ఆంధ్రప్రభ స్టాప్ రిపోర్టర్ లక్ష్మణ్ పాల్గొని మొదటి బహుమతి మూడువేల రూపాయలు రెండవ బహుమతి 2000 రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు సంక్రాంతి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు డాన్సులు వేసిన చిన్నపిల్లలకు కూడా కన్సలేషన్ బహుమతులు అందజేయడం జరిగింది.ముందుగా ముఖ్యఅతిథిల ను సన్మానించి వార్త తరంగాలు మెమొండను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తా తరంగాలు 25వ వార్షికోత్సవం సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు గౌతమ్ పూర్ రుద్రంపూర్ ధన్బాద్ మహిళల కోరకు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని నిజాలని నిర్భయంగా రాస్తూ అందరి మన్ననాలు అందుకుంటున్న వార్త తరంగాలు ముందు ముందు రోజులలో ప్రజల పక్షాన పోరాడాలని వారన్నారు. ఈ సందర్భంగా రత్నకుమార్ మాట్లాడుతూ వార్త తరంగాలు జాతీయ దినపత్రికలో అవకాశం కల్పించిన ఎడిటర్ విజయ రాజు సార్ కి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ఎన్ని ఇబ్బందులు ఎదురైన ప్రజల సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తూ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు కొనసాగుతానని అన్నారు. ఈ కార్యక్రమాలో ప్రగతి గ్రామ సమాఖ్య వివో ఏ పద్మ డ్వాక్రా మహిళలు కిరణ్ ఈవెంట్స్ ఆర్గనైజర్ గండికోట కిరణ్ 95 న్యూస్ బాలకృష్ణ యాంకర్ స్నేహ ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి