చాంపియన్స్‌ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా కమ్మిన్స్‌..

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి క్రికెట్‌ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా పాట్‌ కమ్మిన్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల టెస్టుల్లో గాయపడిన ఫాస్ట్‌ బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌కు సైతం జట్టులో చోటు కల్పించింది. ఓపెనర్‌ జేక్‌ ఫ్రేజర్‌, మెక్‌గర్క్‌కు సైతం జట్టులో చోటు దక్కింది. పాక్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవమైన ఫామ్‌తో జాతీయ జట్టుకు దూరం కాగా.. మళ్లీ చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఆల్‌రౌండర్లు, ఫాస్ట్‌ బౌలర్లతో పాటు స్టార్‌ బ్యాటర్స్‌తో జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది.

ఈ సందర్భంగా ఆసిస్‌ చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిల్‌ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్‌, వెస్టిండ్‌ సిరీస్‌, ఇంగ్లాండ్‌ పర్యటనలో విజయవంతమైన జట్టు ఇదని తెలిపారు. పాకిస్థాన్‌ సిరీస్‌లోనూ విజయవంతమైన ఆటగాళ్లతో కూడిన సమతుల్య, అనుభవజ్ఞులైన జట్టని.. పాక్‌లోని పరిస్థితులకు అనుగుణంగా బెస్ట్‌ టీమ్‌ని ఎంపిక చేశామనన్నారు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్నది. పాకిస్థాన్‌తో పాటు దుబాయి వేదికగా జరుగనున్నది. టీమిండియా మ్యాచులు దుబాయిలో జరుగుతాయి. ఇక చాంపియన్స్‌ ట్రోఫీకి ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లను ప్రకటించారు. ఈ ఈవెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఎనిమిది జట్లను రెండేసి గ్రూపులుగా విభజించారు.

ఆస్ట్రేలియా జట్టు ఇదే..

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీప‌ర్‌), నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ ల‌బుషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, ఆడమ్‌ జంపా, మార్కస్ స్టొయినిస్‌, మిచెల్ స్టార్క్‌.

Views: 1

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి