స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్ ప్రోగ్రాంలో పాల్గొన్న గుండాల ఎంపిటిసి పురుషోత్తపట్నం సర్పంచ్

స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివాస్ ప్రోగ్రాంలో పాల్గొన్న గుండాల ఎంపిటిసి పురుషోత్తపట్నం సర్పంచ్

8dd0af5f-76aa-4749-aa92-b7d61d8856f9గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 18.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాష్ ప్రోగ్రాం కు స్థానిక ప్రజాప్రతినిధులైన గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి మరియు పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్ధా ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ కలిసి ముందుగా  స్వచ్ఛ దివాస్ కార్యక్రమం గురించి ప్రతిజ్ఞ చేసి అనంతరం సెయింట్ ఆన్స్ స్కూల్ జంక్షన్ నుంచి గోళ్ళగట్ట రోడ్ లో    రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తను దగ్గరగా పోగు చేసి చెత్త ను కాల్చి వేయడం జరిగింది. ఈ సందర్భంగా గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పరిశుభ్రత మరియు పరిసరాల మీద అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ముఖ్యంగా దానిలో భాగంగా,
వ్యక్తిగత పరిశుభ్రత- ఒకరి ఆరోగ్యానికే భద్రత,
 పరిసరాల పరిశుభ్రత- ప్రజలందరికీ భద్రత,
 చెత్త నుండి సంపద - చేద్దాం రండి ముందర!
 చీపురు పట్టు చెత్తను నెట్టు అదే ప్రగతికి తొలి మెట్టు!
 పర్యావరణాన్ని పరిరక్షించండి భావితరాలను సంరక్షించండి!
 మనలో మార్పు తెచ్చుకుందాం మన గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా నడిపిద్దాం!అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, పురుషోత్తపట్నం సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శి పూసం నాగేశ్వరరావు, సచివాలయం స్టాప్, హెల్త్ మరియు వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Related Posts

Latest News

విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి విద్యార్థులు శాస్త్రవేత్తలై సమాజానికి సేవలందించండి
శాతవాహన స్కూల్లో సివి రామన్ జయంతి వేడుకలు   అక్షర గెలుపు సిరిసిల్ల :శాస్త్రీయంగా ఆలోచించండి.. శాస్త్రవేత్తలై సమాజానికి సేవ చేయండి అంటూ కరస్పాండెంట్ వేణుగోపాల్ విద్యార్థులకు పిలుపునిచ్చారు....
తెలంగాణలోని పాఠశాలలో వాటర్ బెల్?
కరీంనగర్ రూలర్ మండల్ బహుదూర్ఖాన్పేట్ గ్రామంలో రెడ్డి సంఘం ఏకగ్రీవ ఎన్నికైన గుర్రమంజి రెడ్డి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
గుర్తింపు లేని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీల మోసాల బారిన పడకండి
ఏఈ అమరేందర్ కు సన్మానం...
మైనింగ్ సూపర్వైజర్ల బదిలీలను నిలిపివేయాలి