భారత దేశ నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర కీలకం

భారత దేశ నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర కీలకం

0e017ba7-d4d7-4aff-b85a-9af7f857e6c5

వందేళ్ల సిపిఐ పండుగకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి

ప్రతి నియోజకవర్గంలో భారీ భహిరంగ సభకు ప్రణాళిక

 సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.
లక్ష్మిదేవిపల్లి/కొత్తగూడెం స్వతంత్ర పోరాటం నుంచి పురుడు పోసుకున్న కమ్యూనిస్టు పార్టీ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని, స్వతంత్ర అనంతరం భారత దేశ నిర్మాణంలోనూ కీలక భూమిక పోషించిందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని దారా ఫంక్షన్ హాల్ నందు శనివారం జరిగిన కొత్తగూడెం టౌన్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల స్థాయి కార్యవర్గ సభ్యుల సమావేశానికి అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సిపిఐది వందేళ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర అని, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బ్యాంకుల విలీనం, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, అదే క్రమంలో పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతోందని అన్నారు. శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో గ్రామ గ్రామాన ఉత్సావాలి జరిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 26న జిల్లా వ్యాపితంగా జెండావిష్కరణలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి గ్రామంలో బస్తీల్లో పెద్దఎత్తుల ఉత్సవాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో భారీ భహిరంగ సభలు నిర్వహించబోతున్నామని, జిల్లా స్థాయి బహిరంగ సభ జనవరిలో ఐదు లక్షల మందితి నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈనెల 30న నల్గొండలో భారీ భహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముగింపు సభ 2025 డిసెంబర్ 25న ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రగిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాసి వెంకటేశ్వర్ రావు, సలిగంటి శ్రీనివాస్, మండల కార్యదర్శులు వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, కందుల భాస్కర్, రత్నకుమారి, ఫహీమ్, పొలమూరి శ్రీను, మాతంగి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

 గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన గుంటూరు ట్రాఫిక్‌ పోలీసుల వినూత్న ప్రచారం..యముడు, గణేశుడు వేషాధారణతో అవగాహన
    ట్రాఫిక్‌ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు ఏపీలోని గుంటూరు పోలీసులు వినూత్న తరహాలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యమధర్మరాజు గణేశుడి అవతారంలో వాహనదారులకు అవగాహన
బంగారంపై 20 శాతం రిటర్న్స్.. ఇవీ కారణాలు..!
తెలంగాణ సినీ పరిశ్రమపై రేవంత్‌ మండిపాటు .. షూటింగ్‌లకు ఏపీకి రమ్మని పవన్‌ కల్యాణ్‌ రిక్వెస్ట్
నేను ఏ రోడ్‌ షో.. ఊరేగింపు చేయలేదు.. నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే.. : అల్లు అర్జున్‌
విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ లో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవ వేడుకలు
యూసఫ్ నగర్ మహా పడిపూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు...
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక