రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జూనియర్ కబడ్డీ బాలుర జట్టు ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 21.
కొత్తగూడెం తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే 50 వ అంతర రాష్ట్ర జూనియర్ బాలుర కబడ్డీ టోర్నమెంట్ కి 15 మందితొ కూడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలుర జట్టును ఎంపిక చేశారు. ఈ సెలక్షన్ కి జిల్లా నలుమూలల నుండి 100 పైగా క్రీడాకారులు హాజరు అవ్వగా వారిలో అత్యుత్తమ్మ ప్రతిభ కనబరిచిన 15 మంది క్రీడాకారులును ఎంపిక చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ వారికి స్పోర్ట్స్ మెటీరియల్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చీకటి కార్తీక్ మాట్లాడుతు క్రమశిక్షణ, అంకిత భావం కలిగి ఉంటే క్రీడల్లో రాణిస్తారని, రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లా పేరు నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్, ఐఎన్టియూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ప్రధాన కార్యదర్శి కె స్వాతిముత్యం, కోశాధికారి కూరాకుల నరేష్, సహాయ కార్యదర్శి ఈ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.