పీఎఫ్ మోసం కేసులో.. మాజీ క్రికెటర్ ఊతప్పకు అరెస్టు వారెంట్ జారీ
బెంగుళూరు: మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఉద్యోగులకు పీఎఫ్ ఇచ్చే అంశంలో అతను మోసానికి పాల్పడినట్లు తేలింది. అతనికి చెందిన బట్టల కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లోకి పీఎఫ్ జమ చేయలేదు. అయితే 27వ తేదీ వరకు అతని టైం కల్పించారు. ఒకవేళ 24 లక్షల బకాయి చెల్లించకుంటే అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
బెంగుళూరుకు చెందిన సెంటౌరస్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆ కంపెనీ సుమారు 24 లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ ఆ డబ్బులు అతను చెల్లించలేదని ప్రాంతీయ పీఎఫ్ కమీషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి తన అరెస్టు వారెంట్‌లో పేర్కొన్నారు. డిసెంబర్ నాలుగవ తేదీన ఆ వారెంట్ జారీ చేశారు. ఉద్యోగులకు చెందిన పీఎఫ్ అమౌంట్‌ను విత్‌డ్రా చేసినట్లు ఊతప్పపై ఆరోపణలు ఉన్నాయి. అయితే అతను ఉద్యోగుల అకౌంట్లలోకి నిధులను డిపాజిట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పేద కార్మికుల పీఎఫ్ అకౌంట్లను సెటిల్ చేయని ఊతప్పను అరెస్టు చేయాలని లేఖలో కోరారు. భారత జట్టు తరపున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడాడు. ఐపీఎల్‌లో అతను పాపులర్ ప్లేయర్. ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఊతప్ప 1183 రన్స్ చేశాడు. దాంట్లో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.