బ్రిస్బేన్‌లో వర్షం.. ఇండియా 48/4
గబ్బా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టు(AUSvIND).. మూడవ రోజు వర్షం అడ్డుగా నిలిచింది. ఇండియా 4 వికెట్లు కోల్పోయి 48 రన్స్ చేసిన సమయంలో వర్షం పడింది. దీంతో టీ బ్రేక్ తర్వాత ఇంకా ఆట మొదలుకాలేదు. అంతకముందు ఆస్ట్రేలియా 445 రన్స్‌కు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇండియా.. పేలవ ఆటను ప్రదర్శించింది. భారత టాపార్డర్ బ్యాటర్లు తడబడ్డారు. కేఎల్ రాహుల్ మినహా.. మిగితా బ్యాటర్లు ఆసీస్ పేసర్లను అడ్డుకోలేకపోయారు.
జైస్వాల్ 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 రన్స్ చేసి ఔటయ్యారు. స్టార్క్ రెండు వికెట్లు తీసుకోగా.. హేజిల్‌వుడ్, కమ్మిన్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. భోజన విరామ సమయానికి ఇండియా 22 రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రెండో సెషన్‌లో కీలకమైన పంత్ వికెట్‌ను కూడా చేజార్చుకున్నది.
టీ బ్రేక్ సమయానికి రాహుల్ 30, రోహిత్ ఖాతా తెరవకుండా క్రీజ్‌లో ఉన్నారు. అయితే వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి ఇండియా ఇంకా 397 రన్స్ వెనుకబడి ఉన్నది.