జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

94b8453a-48be-4ce6-a8f1-08320dcfd899

సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 18. 
హేమచంద్రపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్  పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏఆర్ అధికారులు మరియు సిబ్బంది సమక్షంలో ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ ముందుగా క్రైస్తవ సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన,సాంస్కృతిక పండుగ అని అన్నారు.ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా అంగరంగ వైభవంగా జరుపుకుంటారని తెలిపారు.ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.అన్ని మతాల ప్రజలు మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.అనంతరం సెమీ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అనందాన్ని పంచుకున్నారు.
ఈ వేడుకలలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్ఐలు నరసింహారావు,కృష్ణారావు,లాల్ బాబు మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: