ఈనెల 26,27 తేదీల్లో భద్రాచలం గిరిజన భవన్ నందు జరుగు జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం 50 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జయప్రదం చేయండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 24.
భద్రాచలం ఐటిడిఏ పక్కన ఉన్నటువంటి గిరిజన భవన్ నందు జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం యొక్క 50వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను మరియు ఆదివాసి సమస్యలు పాలసీల పై సెమినార్, మరియు సభ నిర్వహిస్తున్నట్లు జాతీయ ఆదివాసి సంఘాల జేఏసీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర స్పష్టం చేశారు. నేడు ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్నటువంటి లీగల్ సెల్ కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆదివాసి సంఘాల ముఖ్య నేతలతో సమీక్ష చేశారు.ఈ యొక్క సమీక్షలో 26,27 తేదీన తెలంగాణ, ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో సెమినార్ మరియు 27వ తారీఖున భారీ ఎత్తున గిరిజన భవన్ లో సభ నిర్వహిస్తున్నట్లు ఈ యొక్క సభకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ సీతక్క గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ పాల్గొంటున్నారని ఈ యొక్క సెమినార్ ,సభకు ఆదివాసి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు సంఘ నాయకులు, కార్యకర్తలు ,ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని ఆదివాసీ సమస్యలపై,హక్కులపై భవిష్యత్తు కార్యాచరణకై సలహాలు సూచనలు ఇవ్వుటకు భద్రాచలం కదిలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ యొక్క సమీక్ష సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, ఆదివాసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, ఆదివాసి అడ్వకేట్ పోరం రాష్ట్ర అధ్యక్షులు చీమల నరసింహారావు, గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా నరసింహారావు, ఆదివాసి విద్యార్థి సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఇర్పా ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు సోడే వీరేష్, తుర్రం మురళి,అడ్వకేట్స్ కొర్స నరేష్,కారం రమేష్, కొరస కృష్ణార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు