కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 05:
కోరుట్ల లో విశ్వ హిందూ పరిషద్,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన వక్త లింగంపేట ధనుంజయ్
మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రతి ఒక్క యువకుడిని దేశభక్తుడిగా తయారు చేయడమే కాకుండా భారతదేశ రక్షణ కొరకు జాతీయ భావాలు నింపి ప్రతి కుటుంబంలో బజరంగ్ దళ్ కార్యకర్తను తయారు చేయడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు.డాక్టర్ రామ్ సింగ్ మాట్లాడుతూ
ప్రలోభాల ద్వారా
ఇతర మతం లోకి వెళ్లినటువంటి వారిని తిరిగి ఘర్ వాపసి ద్వారా స్వధర్మం హిందూ మతంలోకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశమని లవ్ జిహాద్ బారి నుండి హిందూ యువతలను రక్షించడం,గో రక్షణ చేయడం,హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారిని సన్మార్గంలో నడిచేలా చేయడం సేవా,సురక్ష,సంస్థాన్ మూడు నినాదాల ద్వారా బజరంగ్ దళ్ కార్యకర్తలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం త్రిశూల్ దీక్ష ద్వారా జరిగిందని ప్రభుత్వాధినంలో ఉన్నటువంటి ఎండోమెంట్ యాక్ట్ రద్దు చేయాలని దేవాలయాల స్వయం ప్రతిపత్తిని హిందువులకు అప్పచెప్పాలని హిందువుల దేవాలయాల లో పనిచేస్తున్నటువంటి అన్యమతస్తులకు ఎటువంటి స్థానం లేదని అన్నారు.బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు త్రిశూల్ దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.బజరంగ్దళ్ కార్యకర్తలు కోరుట్ల పట్టణ పురవీధుల గుండా హనుమాన్ ధ్వజాలను పట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో
పద సంచలనం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్,బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు,విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్,ప్రధాన వక్త ధనుంజయ్,ఆల్లె మధు,జిల్లా అధ్యక్షుడు పద్మాకర్,జిల్లా కార్యదర్శి గజం రాజు,జిల్లా ఉపాధ్యక్షులు పోహార్ తుకారం,జిల్లా బజరంగ్దళ్ కన్వీనర్ రోహిత్,కో కన్వీనర్ మనోహర్,చెట్పల్లి శంకర్,కోయల్కర్ శివ,గొడికె విజయ్,వెంకటేష్,జయ ప్రకాష్,వివిధ హిందూ సంస్థ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.