స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి శతయంతి ఉత్సవాలు..
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్25:
ఈరోజు భరతమాత ముద్దుబిడ్డ భారతరత్న మాజీ ప్రధాని భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పాయ్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా 22వ వార్డులోబాలాజీ రోడ్ రామ్ నగర్ లొ ఆ మహానుభావుని విగ్రహానికి పూలమాలవేసి భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అలాగే స్థానిక ప్రభుత్వ దావఖానలో రోగులకు పండ్లు పాలు పంచుతూ ఆ మహనీయుడు చేసిన సేవలను వారికి వివరిస్తూ స్మరించుకోవడం జరిగింది
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్ కౌన్సిలర్ పెండెo గణేష్ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు సుదవేని మహేష్ సీనియర్ నాయకులు ఇందూరి సత్యం చిరు మల్ల ధనుంజయ్ రాచమడుగు శ్రీనివాసరావు జక్కుల జగదీశ్వర్ ఇట్యాల నవీన్ కంఠం ఉదయ్ ఎర్ర రాజేందర్ సాడిగా మహేష్ గుండేటి సంజీవ్ దమ్మ సంతోష్ మేకల గణేష్ పాటు నరసయ్య గజ్జి రంజిత్ వార్డు ప్రజలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.