ఎంఎంఎస్ ఆధ్వర్యం లో సామాజిక, సాంఘిక విప్లవకారుని,చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 193 వ జయంతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 03.
భద్రాచలం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మహాజన మహిళా సమైక్య, మాదిగ మహిళ సమైక్య ఎంఎంఎస్ ఆధ్వర్యంలో మదర్ ఆఫ్ ది నేషన్,చదువుల తల్లి సావిత్రిబాయి 193వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి సాంఘిక సామాజిక విప్లవ కారిని సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ప్రముఖ హేతువాది సామాజిక ఉద్యమ నేత డాక్టర్ భాను ప్రసాద్, బహుజన నేత అంబేద్కర్ వాది ఈటె రాజేశ్వరరావులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మదర్ ఆఫ్ ది నేషన్, భారత జాతి మాత అని,భారత దేశంలో స్వదేశీ ఉద్యమ ప్రారంభకురాలని,దేశంలో తొలిసారిగా మహిళలకు పాఠశాలలు ప్రారంభించి చదువు చెప్పిన భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు అని అన్నారు.
వితంతు బ్రాహ్మణ గర్భవతి మహిళలకు ఆశ్రయమేర్పరచి పురుడుపోసి , ఓ వితంతువుకు పుట్టిన కొడుకునే స్వంత కొడుకుగా సాదుకున్న మాతృమూర్తి అని,
బాల్య వివాహం , పరువు హత్యలను ఎదురించి కులాంతర వివాహాలు వితంతు పునర్వివాహాలు నిర్వహించిన మార్గదర్శి అని కొనియాడారు.
భర్త మహాత్మ జ్యోతిబా పూలే మరణాననంతరం దేశంలో తొలిసారిగా ఒక మహిళగా భర్త చితికి తనే స్వయంగా నిప్పు పెట్టి భర్త ఆశయాలను ముందుకు తీసుకెల్లిన ఆచరణశీలి అని గుర్తు చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి పూలే దంపతుల జీవితం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలు ఆదర్శంగా తీసుకొని ప్రజా పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్లం సమ్మక్క, ఉపాధ్యక్షురాలు కొచర్ల కుమారి, కొప్పుల నాగమణి, మండల అధ్యక్షురాలు గుండె సుహాసిని మాదిగ, తిప్పనపల్లి సమత మాదిగ,ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్, కొప్పుల తిరుపతి మాదగ, మండల సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ,కోట ప్రభాకర్ మాదిగ,బొక్క రాంబాబు మాదిగ, దేపంగి రామచంద్రం మాదిగ, మండల అధ్యక్షుడు బొక్క వీనేష్ మాదిగ, కారుమంచి సతీష్ మాదిగ, తిప్పనపల్లి సతీష్ మాదిగ,మెడ్జర్ల లక్ష్మణ్ మాదిగ, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురిజాల వెంకటేశ్వర్లు మాదిగ, ఇసంపల్లి ముత్యం మాదిగ, మర్మం చిట్టిబాబు, అలవాల తిరుపతి, బహుజన సంఘం నాయకులు
ఏవి రావు, తదితరులు పాల్గొన్నారు.