పాత పాల్వంచ అయ్యప్పస్వామి మహాపడిపూజలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 24.
పాత పాల్వంచలో సోమవారం రాత్రి నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడిపూజలో *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డి సి ఎం ఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, పూజలు చేసారు.
పాత పాల్వంచలోని రజక సంఘం ఆధ్వర్యంలో 30 మంది స్వాములు నిర్వహించిన పడిపూజల్లో భజనా కార్యక్రమాలు జరిగాయి. పాల్వంచ పట్టణానికి చెందిన స్వాములు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్పస్వామి దేవాలయం పూజారి బృందావనం నరసింహమూర్తి అభిషేకాలు, పూజలు చేశారు.
ఈ సందర్భంగా కొత్వాల తోపాటు, దేవస్థానం ట్రస్ట్ సభ్యులను, గురుస్వాములను సన్మానించారు.
ఈ కార్యక్రమాల్లో *నిర్వాహకులు ముదిగొండ వెంకన్న, అమరాబాదుల సీతయ్య, నల్లగట్ల నవీన్, కొమర్రాజు బ్రహ్మం, దేవాలయం ట్రస్ట్ సభ్యులు మేడిద సంతోష్ గౌడ్, బందెల శ్రీనివాస్, కనగాల రాంబాబు, మిరియాల కమలాకర్, బండి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.