కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...

కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...

 అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 05:

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు పొందిన సందర్భంగా అవార్డు గ్రహీత ప్రాణదాత కటుకం గణేష్ కు కోరుట్లకు చెందిన అడ్లగట్ల గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా  సన్మానం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోరుట్ల  ప్రాంతంలో ఒకప్పుడు రక్తం దొరకగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు గత 17 సంవత్సరాల నుండి సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ రక్తదాన ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో రక్తదానానికి కొదవ లేకుండా చూస్తున్న కటుకం గణేష్ ధన్యజీవని వారు పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి ఇంకా మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు. 
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్, ఫంక్షన్ హాల్ యజమాని  కటుకం జగదీశ్వర్, అబాకస్ శిక్షకులు అడ్లగట్ల గంగాధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని