కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:
నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలో గతంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు హయంలో ఏర్పాటు నిర్మించిన టువంటి కళ్యాణ మండపం పనులు నేటికీ అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగరావు విజ్ఞప్తి మేరకు 60 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేసింది ఇట్టి పనుల ప్రారంభం కోసం నిబంధన మేరకు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంల అనుమతి అవసరం ఉండడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఈరోజు హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో ఉన్న టిటిడి కార్యాలయం నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణ అధికారికి అభివృద్ధి పనులప్రారంభానికి అనుమతి కోరుతూ కార్యాలయం ద్వారా నివేదించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై నాగరాజు అసిస్టెంట్ ఇంజనీర్ సి నాగరాజు లు ఉన్నారు