మహిళా సాధికారతకై కృషి చేసిన మహనీయులు.. రాష్ట్ర కార్యదర్శి బీ సి యువజన సంఘం.. శికారి గోపికృష్ణ అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:
శుక్రవారం రోజున స్థానిక పట్టణములోని రామకృష్ణ డిగ్రీ పి జీ కళాశాలలో వీరనారి మహాత్మా సావిత్రీ బాయి పూలే 194 వ జయంతి తెలంగాణ రాష్ట్రబి.సి.యువజన సంఘ ము అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భం గా బి సి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శికారి గోపి కృష్ణ మాట్లాడుతూ .... గొప్ప మానవతా మూర్తి ,సంఘ సంస్కర్త సావిత్రీ భాయ్ పూలే వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి,విద్యార్థుల విద్యా భ్యాసం కోసం అలు పెరుగని కృషి చేసిన యోధులు,మహానుభావులు,వీరనారి సావిత్రీ భాయ్ పూలే సామాజిక ఉద్యమ స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని చైతన్య పరచాల్సిన బాధ్యత యువ భారతీయుల భుజస్కంధాలపై ఉంది అని ఆశిస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయులని అన్నా రు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ బిజ్జారపు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రీ భాయ్ పూలే జయంతి ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని కొనియాడారు సావిత్రీ భాయ్ పూలే 194 వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి ఘన నివాళులు అర్పిస్తూ.ఇట్టి జయంతి కార్య క్రమంలో బి సి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సం యుక్త
కార్యదర్శి తుమ్మనపెల్లి రాజేంద్రప్రసాద్,రాజ్ కుమార్,
నాగరాజు,భూమారెడ్డి,రాజ గణేష్,నరేందర్,నాగభూషణ్, మనోహర్, శ్రీనివాస్,జితేంద్ర చారి.బి సి సంఘం నాయ కులు పాల్గొన్నారు .