ఎస్ఎఫ్ఐ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ కల్పన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 03.
ములకలపల్లి ఎస్ఎఫ్ఐ నూతన 2025 సంవత్సర క్యాలెండర్ ను శుక్రవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల నందు ములకలపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కల్పన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కల్పన మాట్లాడుతూ... విద్య హక్కుల కోసం పోరాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో చదువుకుని ఉన్నత స్ధాయికి ఎదగాలని, పరీక్షలలో మంచి ర్యాంకు సాధించాలని పట్టుదలతో చదువుకోవాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ కాలేజీ నాయకులు సోహెల్ మాట్లాడుతూ... నిరంతరం విద్యార్థుల హక్కుల పోరాటాలలో విద్యార్థులకు అందుబాటులో ఉండే విద్యార్థి ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు.1970లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ 55 సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలపై హక్కుల కై అనేక ఉద్యమాలు,పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు.విద్యార్థుల సమస్యల పై నిరంతరం గళం విప్పి సమస్యల పరిష్కరమైయ్యేవరకు పోరాడే ఎస్ఎఫ్ఐ నేనని అన్నారు.ఈకార్యక్రమంలో సమ్రీన్, పవన్, రాజేశ్వరి,ఇందు,కల్పన, సమీరా,కొండ చరణ్య, తదితరులు పాల్గొన్నారు.