బర్ధన్ చిత్రపఠం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు, కార్యకర్తలు
దేశ సమైక్యత, సామాజిక న్యాయంకోసం తుదిశ్వాస వరకు పోరాడిన ఏబి.బర్ధన్
శ్రమజీవులు విముక్తికోసం నిరంతరం శ్రమించిన మహానేత
కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యతకు చిత్తశుద్ధితో కృషి చేసిన దిశాలీ బర్దన్
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా బర్దన్ 9వ వర్ధంతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 02.
కొత్తగూడెం దేశ సమైక్యత, సామాజిక న్యాయంకోసం తున తుదిశ్వాస వరకు పోరాడిన మరపురాని మహానేత ఏబి.బర్ధన్ అని, అయన ఆశయాలకు నేటితరం నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సిపిఐ, ఏఐటియుసి మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబి. బర్దన్ 9వ వర్ధంతిని గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత బర్దన్ చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 ఏళ్ళ వయస్సులోనే భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించాడన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న అటవీ హక్కుల చట్టం, భవన నిర్మాణ కార్మిక చట్టం, సమాచార హక్కు చట్టం ఏబి. బర్ధన్ కృషి ఫలితమేనన్నారు. శ్రమజీవుల విముక్తికోసం నిరంతరం శ్రమించాడని, నాగ్పూర్లో బలమైన ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్మించాడని, నగర పార్టీ, విదర్భప్రాంత పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తూ రహస్య జీవితం గడిపాడన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం తనవంతు కృషి చేశాడన్నారు. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులుగా, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శిగా ఢీల్లీ కేంద్రంగా పనిచేశారని, అసమయంలో విద్యుత్ రంగంలో జాతీయ స్థాయిలో బలమైన ఏఐటియుసి యూనియన్ ను నిర్మించడంతోపాటు విద్యుత్ రంగ ట్రేడ్ యూనియన్లంటిని కలిపి జాతీయ స్థాయి కమిటీ ఏర్పాటు చేశాడన్నారు. రక్షణరంగంలో ఉన్న ట్రేడ్ యూనియన్లను ఐక్యం చేయడంలో ఆయన కృషి చేసి ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో ముందుకు నడిపాడన్నారు. 16 సంవత్సరాలపాటు సిపిఐ ప్రధాన కార్యదర్శిగా విశేషసేవలందించి కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యతకు చిత్తశుద్ధితో కృషి చేశారని, వామపక్ష నాయకులతో సుహృద్భావ సంబంధాలు, సైద్ధాంతిక, రాజకీయ చర్చలు సాగించారన్నారు. రిజర్వేషన్లు, కార్మిక సమస్యలపై అనేక రచనలు చేశారన్నారు. కమ్యూనిస్టు పార్టీ విస్తరణకోసం, శ్రమజీవుల విముక్తికోసం నిరంతరం శ్రమించిన బర్దన్ అడుగుజాడల్లో నడుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.