పాల్వంచలో కేక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న
రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 28.
పాల్వంచలో అంబేద్కర్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కేక్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
శనివారం కేక్ ఫ్యాక్టరీ ని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తోపాటు కొత్వాల ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కేక్ ఫ్యాక్టరీ లో వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన పదార్ధాలను అందించేలా చూడాలన్నారు. సామాన్యులకు సైతం ధరలు అందుబాటులో వుండాలన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వాంకోడోత్ నర్సింహారావు, వాంకోడోత్ గోపి, మాజీ జడ్పిటిసి సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, సి.పి.ఐ నాయకులూ బాగం హేమవంతరావు, ఎస్.కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, ఉండేటి శాంతివర్ధన్, మాలోత్ కోటి నాయక్, బానోత్ బాలూ నాయక్, బాదావత్ సామా నాయక్ తదితరులు పాల్గొన్నారు.