ఐలాపురవాసి ప్రతిభకు పట్టం మెటుపల్లి వారిచే ఘన సన్మానం..

ఐలాపురవాసి ప్రతిభకు పట్టం  మెటుపల్లి వారిచే ఘన సన్మానం..

 అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్30:


కోరుట్ల మండలం లోని అయిలాపుర్
గ్రామానికి చెందిన బెజ్జారపు కళ్యాణాచార్యులు సాహిత్య రంగంలో కృషి చేస్తూ నూతన ఉరవడితో పలు నవీన ప్రక్రియలో వీరు సాహిత్య కృషిని చేస్తూ పలు పురస్కారాలు పొందుతూ   కొన్ని వసంతాలుగా తన ప్రజ్ఞను చాటుతున్న ఈ కవి..ఒక కవికి కాలమానముతో కొలమానము లేదన్నట్టు తన సాహిత్యముతో చాటి చెబుతూ ఎన్నో సమాజ ఉపయోగకరచనలు చేస్తూ కూడా  సంగీత సాధనలో కూడా తన వైవిద్య కళను చూపుతూ  తన వృత్తి వడ్రంగంలో కూడా వివిధ కళాకృతులను తయారుచేసి పలువురి ప్రశంసలు మన్ననలను పొందుతూ తన కళలను ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా నలుగురికి పంచుతూ హృదయానంద పరుస్తున్న ఈ కవి బెజ్జారపు కళ్యాణాచార్యులు మున్నీమధ్యనే జ్యోతిష్య శాస్త్రంలో   మాస్టర్ ఆఫ్ ఆస్ట్రాలజీ పట్టభద్రులైనారు వీరి కళలను వీరి సాహిత్యాన్ని గుర్తిస్తూ మాస్టర్ ఆఫ్ ఆస్ట్రాలజీ పట్టభద్రుడైన సందర్భముగా   విశ్వబ్రాహ్మణ  మనుమయ సంఘం మెట్టుపల్లి  సంఘ సర్వసభ్యులు కార్యవర్గ సభ్యులు ఇతని కృషిని అభినందిస్తూ ఘనంగా సత్కరించుకోవడం జరిగింది పలువురు మాట్లాడుతూ  మన విశ్వకర్మ బిడ్డలు ఇలా ఇంకా ఎన్నో రంగాలలో పట్టు సాధిస్తూ తమ నైపుణ్యాలను కళలను  ప్రదర్శిస్తూ విద్యా ఉద్యోగ రంగాలలో కూడా మంచి పట్టును సాధిస్తూ తమ అభ్యున్నతిని పట్టుదలతో కాంక్షించి సాధించాలని కోరారు బెజ్జారపు కళ్యాణాచార్యులను మెట్టుపల్లి  విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ సభ్యులు హార్దిక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు   కల్యాణాచార్యులు మాట్లాడుతూ మేము ఇంతటి సత్కారానికి నోచుకొనుటలో మాకు వెన్నంటే తోడుండి ఈ  విద్యను అందించినటువంటి రథం మదనాచార్యులు గారు మునగాల యాదగిరి ఆచార్యులు వీరికీ ఎంతో రుణపడి ఉంటానని ఈ సన్మానాలు సత్కారాలు మేము ఇంకా ఎంతో బాధ్యతను నిర్వర్తించుటలో ముందు వరసలో ఉంచుతాయని తెలుపుతూ   మెట్టుపల్లి విశ్వబ్రాహ్మణ  మనుమయ  సంఘ కుల బాంధవులకు గురువర్యులకు తన హృదయపూర్వక వందనములు తెలిపారు.

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: