విద్యారంగ సమస్యల పోరాటంలో మడమతిప్పని ఎస్ఎఫ్ఎ
జెండావిష్కరించిన ఎస్ఎఫ్ఎ కళాశాల అధ్యక్షులు రిశ్వంత్
ఘనంగా జరిగిన ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 28.
కొత్తగూడెం విద్యారంగ సమస్యల పరిష్కార పోరాటంలో ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘం ఏనాడు మడమతిప్పని పోరాటాలు చేసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం అన్నారు. శనివారం ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు బయ్య అభిమన్యు అధ్యక్షతన కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల కార్యదర్శి రిశ్వంత్ ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించగా కళాశాల కార్యదర్శి రమ్య భగత్ సింగ్ చిత్రపటానికి పూల మాల వేసి ప్రారంభించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం గారు మాట్లాడుతూ.1970 డిసెంబర్ 28 నుండి 30వ తేదీల్లో కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ప్రాంతంలో 'అధ్యయనం- పోరాటం' అనే నినాదంతో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే లక్ష్యాలతో 11 మంది సభ్యులతో ఏర్పడి 55 సంవత్సరాలు గడుస్తుంది. అప్పటి నుండి విద్యార్థుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. ఈ పోరాటంలో చాలా మంది విద్యార్థి నాయకులని కోల్పోయినప్పటికీ, నిర్బంధాలు ఎదుర్కొంటూ, ప్రభుత్వాలు దాడులు చేస్తున్నప్పటికీ, నాయకుల మీద కేసులు పెడుతున్నప్పటికి ,మతోన్మాద దాడులను తిప్పి కొడుతూ , శాస్ర్తియ విద్యావిధానం కోసం అనునిత్యం పోరాడుతూ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా నిత్యం విద్యార్థుల పక్షాన ఉంటూ అనేక రూపాల్లో భవిష్యత్తులో విద్యారంగం కోసం పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. మా దేహాలు ముక్కలైన కానీ, ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం, అనే నినాదంతో , ముందుకు పోతుందని తెలిపారు.
ఈ కార్య్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద.నాగక్రిష్ణ , జిల్లా కమిటీ సభ్యులు రాంచరణ్ , టౌన్ నాయకులు నాహిద్ పాషా, కళాశాల కార్యదర్శి రమ్య, రోహిణి, రెహానా , జశ్వంత్ , మహీర్ తదితరులు పాల్గొన్నారు.