ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..

 అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:

చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నగర్లోని పాఠశాలలో సావిత్రిబాయి పూలే194 జయంతి వేడుకలను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కోరుట్ల డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళ ఉపాధ్యాయురాళ్లకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 174 సంవత్సరాల క్రితమే సావిత్రిబాయి పూలే మహిళల అభివృద్ధి కోసం, చైతన్యవంతం చేయడం కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి, మహిళలను విద్యావంతురాలను చేశారన్నారు. అప్పుడే ఆమె సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారన్నారు. ఆమె మహిళల కోసం చేసిన సేవలను మరువలేమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య ,బలిజ రాజారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, కోశాధికారి  భూపల్లి నగేష్, మాల సంఘం అధ్యక్షుడు పోట్ట లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు గురు మంతుల సత్తయ్య, కోశాధికారి సామల వేణుగోపాల్, పసుల కృష్ణ ప్రసాద్ ,సామల దశరథం, ఎడ్ల ప్రభాకర్, సామల రాజు నరసయ్య, ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రావు, అఖిల్ అహ్మద్, ముక్క కవిత, రాచర్ల హరిత, చిలువేరి కవిత, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని