అష్టదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞ కరపత్రాల ఆవిష్కరణ….
అక్షర గెలుపు, కోరుట్ల , డిసెంబర్25:
సనాతన ధర్మ ప్రచారం సమితి ఆధ్వర్యంలో జనవరి 1,2025 నుండి జనవరి 7,2025 వరకుకోరుట్ల పట్టణం, వాసవి కల్యాణ భవనములో శృంగేరి పీఠం ఆస్థాన పౌరాణికులు పురాణ ప్రవర బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ గారిచే నిర్వహించనున్న “అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞము” ఆహ్వాన కరపత్రాల ఆవిష్కరణ వాసవి కళ్యాణ భవనములో జరిగింది. ఈ కార్యక్రమం లో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ధర్మో రక్షతి రక్షితః అనే శాస్త్ర వాక్యం ప్రకారం ఈ విశ్వానికి ధర్మమే మూలం. అట్టి ధర్మాచరణ విషయాలన్నింటినీ వేద వ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాల ద్వారా సమాజానికి అందించారు.లోక కళ్యానాన్నీ కోరే మన పురాణ విజ్ఞానం మనం తెలుసుకోవడం,వచ్చే తరాలకు అందించడం మనందరి బాధ్యత. పూర్వం నైమిశారణ్యం లో శౌనకాది మహా మునులకు సూత మహర్షి ద్వారా చెప్పబడిన 18 పురాణాల ప్రవచనంతో మన కోరుట్ల పట్టణమే నైమిషారణ్యంగా సుప్రసిద్ధ పౌరాణికులు బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వర శర్మ గారి ద్వారా మారబోవుచున్నది. ఒక్క పురాణ పురాణ శ్రవణం దొరకడమే ఎంతో పుణ్య ఫలం. ఎన్నో జన్మల పుణ్య ఫలంగా మన కోరుట్ల పట్టణంలో లభిస్తున్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.