జిల్లాలోని వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది 

IMG-20250104-WA0013

ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని వలస గుత్తి కోయ గ్రామాలైన తిర్లాపురం,మల్లారం,పిట్టతోగు గ్రామాల ప్రజలకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 04.
ఏడూళ్ళ బయ్యారం పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల వలస గుత్తి కోయ గ్రామాలైన తిర్లాపురం,మల్లారం,పిట్టతోగు గ్రామాలలో ప్రజలకు ఈ రోజు పిట్టతోగు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కిష్టాపురం గ్రామం నుండి ద్విచక్ర వాహనాలపై దట్టమైన అడవిలో వాగులు,వంకలు దాటుకుంటూ జిల్లా ఎస్పీ  పిట్టతోగు గ్రామాన్ని చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్  ముఖ్యఅతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఉచిత మెగా వైద్య శిబిరానికి సుమారుగా 65 కుటుంబాల నుండి 300 మంది ఆదీవాసీ ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు.వలస ఆదివాసి ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు నిత్యం కృషి చేస్తున్నామని తెలియజేశారు.విద్య,వైద్య మరియు రవాణా సౌకర్యాలను వారికి కల్పించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ వారికి కూడా మెరుగైన జీవితాన్ని అందించడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులందరూ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలన్నింటిని కూడా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని తెలిపారు.ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక చాలామంది దళసభ్యులు మరియు నాయకులు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామాల్లోకి ప్రవేశిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ సోలార్ లైట్లు మరియు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది.యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు.స్కూల్ పిల్లలకు నోటుబుక్స్ ను అందజేశారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొని గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,ఎడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సైలు రాజ్ కుమార్, రాజేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని