జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం 50వ వార్షికోత్సవ సందర్భంగా

జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం 50వ వార్షికోత్సవ సందర్భంగా

భద్రాచలంలో మొదటి  జాతీయ సెమినార్ పోదేం.వీరయ్య ఎక్స్ ఎమ్మెల్యే మరియు 

తెలంగాణ రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్  ప్రారంభించినారు, 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) డిసెంబర్ 26.
భద్రాచలం ఈ సెమినారుకు  శ్రీ చందా లింగయ్య దొర  జాతీయ ఆదివాసి సంఘాల  చైర్మన్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో శ్రీ పోదేం.వీరయ్య  మాట్లాడుతూ ఈ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం 1974 సంవత్సరంలో స్థాపించడం జరిగినది ఈ సంఘంలో  వీరయ్య  అను నేను ఈ సంఘంలో  కూడా పనిచేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అనేక ఆదివాసి అభివృద్ధి పనులతో పాటు వారి ఉనికి కోసం నేను ఎమ్మెల్యే అయ్యేంతవరకు కృషి చేసినాను ఈ సంఘ కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోయి,ఆదివాసులకు అండగా నిలవాలని సూచించారు. ఈ సమావేశంలో శ్రీ చందా లింగయ్య దొర మరియు పాయం సత్యనారాయణ గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు( తెలంగాణ ఆదివాసి సంఘాల జేఏసీ చైర్మన్ ) ఈసం. సారయ్య దొర  ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ, శ్రీమతి డి ఝాన్సీ రాణి జాతీయ ఆదివాసి మహిళ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ నాయకులు శ్రీ చౌదరి లక్ష్మణరావు తెలంగాణ తుడుం దెబ్బ  రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్, తుడు దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల  లక్ష్మయ్య తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్, రిటైడ్ జిసిసి ఆర్ఎం చిడం జంగు గారు, తెలంగాణ ఏ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ శ్రీనివాసరావు రిటైర్డ్ పిపి తాటి వెంకటేశ్వర్లు  తెలంగాణ ఆదివాసి అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ చీమల నర్సిరావు ఆదివాసి అడ్వకేట్స్ ఫోర్ కోఆర్డినేటర్ అర్రెమ్. పాపారావు తదితరులు మాట్లాడం జరిగినది. శ్రీ చందా లింగయ్య దొరగారు మాట్లాడుతూ సెమినార్ ఉద్దేశం పై వివరణ ఇస్తూ ఈ క్రింద తెలిపిన ఆదివాసి జాతీయ విధానంపై 12 సూత్రాలను విడుదల చేయడం జరిగినది.1 జెల్ ( నేటి ప్రాజెక్టుల పారుదల ముంపు ప్రాంతాల నష్టపరిహార విధానం) 2.జంగిల్( అడవి సంపద,సామాజిక అడవులు పోడు భూములు, అడవిలో ఖనిజ సంపద, జంతువు, క్రూర మృగము, ఆవశ్యకత,అడవి సంరక్షణ, గిరిజన హక్కులపై చర్చ) 3. జమీన్( భూమి అభివృద్ధి, భూమి పంపిణీ,భూమి పట్టాలు, బినామీ పట్టాలు, భూభారతి, భూ ఆక్రమణ, భూగర్భ వనరులు,సహజ వనరులు,భూమి రక్షణ, చట్టాలపై చర్చ ) తోపాటు 12 అంశాలు ఎజెండా విడుదల చేయడం జరిగినది.

Views: 0

About The Author

Tags:

Latest News

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..... ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....
  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..విద్యార్థులకు పండ్ల పంపిణీ..
కోరుట్ల కళ్యాణ మండపం అభివృద్ధి పనుల అనుమతి కోసం టీటీడీకి నివేదించిన జువ్వాడి కృష్ణారావు.,.
మంత్రి పొంగులేటి కి వినతి పత్రం అందజేసిన చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రి బాయ్ పూలే జయంతి జయంతి వేడుకలు అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 3:
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ మండల కార్యవర్గ నియామకం అక్షర గెలుపు, హుజూరాబాద్, జనవరి 03:
మహిళా సాధికారతకై  కృషి చేసిన మహనీయులు..  రాష్ట్ర  కార్యదర్శి   బీ సి యువజన  సంఘం..   శికారి గోపికృష్ణ  అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03: