ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....

ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.....

 అక్షర గెలుపు, కోరుట్ల , జనవరి 03:

యస్, ఆర్, యస్, పి,క్యాంప్  గడి కోరుట్ల పాఠశాలలో సావిత్రి బాయి పూలె జయంతి ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు మాట్లాడుతూసావిత్రి బాయి పులే  ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, బ్రిటిష్ పాలన కాలంలో ఉన్న దురాచారాలను అనగా సతీసహగమనం బాల్యవివాహాలు స్త్రీల పట్ల వివక్ష మొదలగు వాటి వల్ల కలత చెందింది. సమాజంలో గల మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో సావిత్రిబాయి పూలే స్త్రీ విద్య కోసం పాటుపడింది. మహిళల కోసం మొదటిసారి పాఠశాలను స్థాపించింది. స్త్రీల విద్యాభివృద్ధికి పాటుపడిన ఉద్యమకారిణి. ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడుతూ, సమాజంలో దురాచారాలు రూపుమాపడానికి కృషి చేసింది. హరిజన విద్యకు కృషిచేసిన మహాత్మా  జ్యోతిరావు పూలే యొక్క సతీమణి ఈమె. భర్తను ఆదర్శంగా తీసుకొని మహిళలకు కూడా పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించడానికి కృషి చేశారు. ఇతర సంస్కర్తలను కదిలించి అనేక పాఠశాలలో స్థాపనకు దారితీసింది సావిత్రిబాయి స్వయంగా స్త్రీలలో చైతన్యాన్ని పెంపొందించేందుకు మహిళా సేవ మండలిని ప్రారంభించింది.ఇంతటి గొప్ప సంఘసంస్కర్తను గుర్తు చేసుకుంటూ ఈమె జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనము మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా జరుపుకుంటున్నాము.అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నునవత్ రాజు మాట్లాడారు ఇట్టి కార్యక్రమం లో ఉపాధ్యాయులు పూర్ణ చందర్,సురేందర్,సురేఖ,ధన లక్ష్మి,సుమలత,విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Tags:

Latest News

చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది చట్టపరమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కార్పొరేషన్ ప్రకటన అసంబద్ధమైనది
సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (అక్షరగెలుపు) జనవరి 05.ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా అస్పష్టంగా ఉందని...
అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు
స్త్రీ ప్రకృతి శక్తి స్వరూపిణి.. బ్రహ్మశ్రీ గర్రెపల్లి మహేశ్వరశర్మ...
కోరుట్లలో బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష....
స్థానిక కొత్తగూడెం లోని కొత్తగూడెం క్లబ్ లో శుక్ర, శని వారాల్లో 
కోరుట్లలో ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం...
ముఖ్యమంత్రికి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని